చైనాలో మళ్ళీ విజృంభిస్తున్న కరోన

By udayam on November 26th / 10:47 am IST

కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి ఆ మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ఆ దేశంలో 500 విమానాలను రద్దు చేసి పలు చోట్ల స్కూల్స్​ను మూసివేశారు. వివిధ చారిత్రక ప్రదేశాలకు టూరిస్టులు రావడాన్ని నిషేధించిన అక్కడి ప్రభుత్వం.. ఆ దేశంలోని పెద్ద నగరం షాంఘైలో మరింత కఠిన లాక్​డౌన్​కు సిద్ధమవుతోంది. రాజధాని బీజింగ్​లో కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ చుట్టుపక్కల ప్రావిన్సుల్లో కొత్త కేసులు బయటపడుతుండడం అక్కడ తీవ్ర కలకలం రేపుతోంది.

ట్యాగ్స్​