దేశంలోని దిగ్గజ స్టార్టప్ కంపెనీలు మీషో, ఓలా, అన్ అకాడమీలతో పాటు మరిన్ని సంస్థలు 8 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. వీటిల్లో కార్స్24, వేదాంతు, ట్రెల్, ఫుర్లెంకోలు సైతం ఉన్నాయి. కాస్ట్ కటింగ్లో భాగంగానే ఈ ఉద్యోగాల తొలగింపును ఈ కంపెనీలు మూకుమ్మడిగా చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వేదాంతు, కార్స్ 24 కంపెనీలు ఏకంగా 600ల మంది చొప్పున ఉద్యోగుల్ని విధుల నుంచి తప్పించింది. ఓలా సంస్థ ఏకంగా 2100 మందిని విధుల నుంచి తప్పించింది.