దేశం మీ పట్ల గర్విస్తోంది

టీమ్​ ఇండియాకు ప్రముఖుల అభినందనలు

క్రికెటర్లకు 5 కోట్ల బోనస్​ ప్రకటించిన బిసిసిఐ

By udayam on January 19th / 8:41 am IST

దేశం మొత్తం గర్వపడే స్థాయిలో ఆటతీరు కనబర్చిన టీమ్​ ఇండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

ఆస్ట్రేలియాలో మీ ప్రదర్శనతో ఎంతో సంతోషించాం.. మీ శక్తి సామర్ధ్యాలు, వెనుకడుగు వేయని మీ నైజం చూస్తుంటే గర్వపడుతున్నాం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు.

రూ.5 కోట్ల బోనస్​ ప్రకటించిన బిసిసిఐ

అద్భుత ప్రదర్శనతో చివరి టెస్ట్​ను గెలుచుకున్న టీమ్​ ఇండియాకు బిసిసిఐ రూ.5 కోట్ల బోనస్​ను ప్రకటించింది. ఈ మేరకు బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్​ గంగూలీ ట్వీట్​ చేశాడు. ఈ విజయాన్ని భారత క్రికెట్​ ఉన్నంత కాలం గుర్తుంచుకునే విషయం అని గంగూలీ పేర్కొన్నాడు.

ఇది టెస్ట్​ క్రికెట్​ అంటే : రిచర్డ్స్​

భారత ఘన విజయంపై లెజెండరీ క్రికెటర్​ సర్​ వివియన్​ రిచర్డ్స్​ స్పందించారు.

‘‘ఇలాంటి ఆటకోసమే కదా టెస్ట్​ క్రికెట్​ అంటే జనం పడి చచ్చేది” అంటూ ఆయన ట్వీట్​ చేస్తూ టీమ్​ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.