ఓవైసీ: మరో మసీదును కోల్పోవడానికి సిద్ధంగా లేం

By udayam on May 13th / 7:42 am IST

ఈనెల 17 నాటికి కాశీ విశ్వనాథ ఆలయం ఆవరణలోనే ఉన్న జ్ఞానవాపి శృంగార్​ గౌరీ కాంప్లెక్స్​లోని హిందూ దేవతల విగ్రహాల భద్రతపై వీడియో రికార్డింగ్​ చేపట్టాలని జిల్లా కోర్ట్​ ఇచ్చిన తీర్పును ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ తప్పుబట్టారు. ఈ తీర్పు 1991లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధమని చెప్పారు. ‘మేం మరో మసీదును కోల్పోవడానికి సిద్ధం లేం’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు టైటిల్​ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఈ సర్వే జరుగుతోందన్నారు.

ట్యాగ్స్​