ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్​ ధర రూ.200!

ప్రభుత్వం నుంచి ఆర్డర్​ అందుకోనున్న సీరమ్​ ఇన్​స్టిట్యూట్​

By udayam on January 11th / 1:15 pm IST

ఆక్స్​ఫర్డ్​ – ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ కోసం భారత ప్రభుత్వం సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాకు ఈరోజు ఆర్డర్​ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఈ కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ ను భారత్​లో సీరమ్​ ఇన్​స్టిట్యూట్​ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం సీరమ్​ నుంచి కొనుగోలు చేసే వ్యాక్సిన్​ను కేవలం రూ.200 లకే ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం.

అయితే జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా తొలి విడత వ్యాక్సినేషన్​ నిర్వహించాలని ఇప్పటికే ముహూర్తం నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా 3 కోట్ల మందికి వ్యాక్సినేషన్​ ను నిర్వహించనుంది. అయితే అది కూడా పూర్తి ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

అనంతరం నిర్వహించే వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​ సమయంలో ప్రజల నుంచి నామమాత్రపు ధర అయిన రూ.200 లను కొవిషీల్డ్​ వ్యాక్సిన్​ ధరగా నిర్ణయించింది.