కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత, కవి శ్రీ భాష్యం విజయ సారథి (86) మరణించారు. కరీంనగర్ శ్రీపురం కాలనీలోని తన స్వగృహంలో అర్ధరాత్రి దాటాక సుమారు ఒకటిన్నర సమయంలో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో 1936 మార్చి 10న విజయ సారథి జన్మించారు. 7వ ఏటనే పద్యరచన ప్రారంభించిన ఆయన, తెలుగులో 100కు పైగా పుస్తకాలు రాశారు. 2020లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఇవాళ సాయంత్రం అధికారిక లాంఛనాలతో కరీంనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.