తెలంగాణలో జాకీ ప్లాంట్​

By udayam on November 17th / 7:33 am IST

ప్రపంచ ప్రఖ్యాత ఇన్నర్​ వేర్​ బ్రాండ్​ జాకీ కంపెనీ ఉత్పత్తులను తయారు చేస్తున్న పేజ్ ఇండస్ట్రీస్.. తెలంగాణలో రూ. 290 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రెండు ఫెసిలిటీస్​ ను ఏర్పాటు చేయనున్న ఈ కంపెనీ.. స్థానికంగా 7 వేల మందికి ఉపాధిని ఇవ్వనుంది. ఈ మేరకు తెలంగాణ మంత్రి కేటిఆర్​ తో ఈ కంపెనీ బృందం భేటీ అయింది. ఇబ్రహీంపట్నం, ములుగు ప్రాంతాల్లో ఈ కంపెనీ తమ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ఏడాదికి కోటికి పైగా గార్మెంట్స్​ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ కంపెనీ ప్లాంట్లు పనిచేయనున్నాయి.

ట్యాగ్స్​