పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వరుసగా చిక్కుల్లో పడుతున్నారు. తాజాగా ఆయన వ్యక్తిగత స్మార్ట్ఫోన్ ఫోన్లు సియాల్కోట్ విమానాశ్రయంలో దొంగతనానికి గురయ్యాయి. గత శనివారం ఆయన సియాల్కోట్లో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం ఈ ఫోన్లు మాయమయ్యాయి. తన ప్రాణాలకు ఎవరెవరి నుంచైతే ప్రమాదం పొంచి ఉందో ఆయన ఓ వీడియో సందేశాన్ని సైతం ఈ ఫోన్ల నుంచే విడుదల చేసిన వెంటనే ఫోన్లను తస్కరించారు. దీనిపై ఇమ్రాన్ పార్టీ సభ్యులు పాక్ అధికార పక్షాన్ని విమర్శిస్తున్నాయి.