నవాజ్​ శిక్షలు రద్దు!

By udayam on May 3rd / 7:31 am IST

అవినీతి కేసుల్లో శిక్ష పడ్డ పాక్​ మాజీ ప్రధాని నవాజ్​ షరీఫ్​కు కలిగించే నిర్ణయాన్ని అక్కడి కొత్త ప్రభుత్వం తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఆయన శిక్షను రద్దు లేదా సస్పెండ్​ చేయాలని ప్రధాని షెబాజ్​ షరీఫ్​ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకునే హక్కు పంజాబ్​ సర్కారుకు ఉన్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రానా సనావుల్లా పేర్కొన్నారు. పాక్​కు కొత్త ప్రధానిగా నియమితులైన షెబాజ్​ షరీఫ్​.. స్వయంగా నవాజ్​ షరీఫ్​కు తమ్ముడే.

ట్యాగ్స్​