న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో పాకిస్థాన్ తృటిలో ఓటమి నుంచి గట్టెక్కింది. 319 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ను ఆ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 118 పరుగులతో ఆదుకున్నాడు. జట్టు మొత్తం విఫలమైన వేళ అతడొక్కడే అడ్డుగోడలా నిలబడిపోయాడు. దీంతో పాకిస్థాన్ 5వ రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రాగా ముగించుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో డబ్ల్యూటిసి ఫైనల్స్ టేబుల్ లో పాకిస్థాన్ 7, న్యూజిలాండ్ 8వ స్థానాల్లో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా, భారత్ లు ఉన్నాయి.