చాలా ఏళ్ళ అనంతరం ఓ అగ్రశ్రేణి జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడుతున్న పాకిస్థాన్ తొలిరోజే కష్టాల్లో కూరుకుపోయింది.
Stumps in Karachi 🏏
14 wickets have fallen today 😲
Pakistan are 33/4, trailing by 187 runs!#PAKvSA ➡️ https://t.co/45UQifG17K pic.twitter.com/peIrMoaWmF
— ICC (@ICC) January 26, 2021
సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సఫారీలను తొలిరోజే 220కి ఆలౌట్ చేసిన ఆ జట్టు అనంతరం బ్యాటింగ్‌కు దిగి కేవలం 33 పరుగలకే 4 వికెట్లు కోల్పోయింది.
కసిగో రబాడ 2 వికెట్లు తీయగా, నోర్కియా 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీసి పాక్‌ను తేరుకోలేని దెబ్బ కొట్టారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు సైతం కరాచీ పిచ్‌పై తేలిపోయారు. ఆ జట్టు ఓపెనర్ డీన్ ఎల్గర్ (58) తప్పితే పెద్దగా ఎవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో యాసిర్ షా 3, షహీన్ అఫ్రిది 2, నవుమన్ అలీ 2, హసన్ అలీ 1 వికెట్ తీశారు.