బ్లాక్ క్యాప్స్ తో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ లో పాకిస్థాన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు రెండో రోజు ఆలౌట్ అయింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ అజాం 161, అఘా సల్మాన్ 103, సర్ఫరాజ్ 86 పరుగులు చేశారు. టిమ్ సౌథీ 3, అజాజ్ పటేల్ 2, మైకె బ్రాస్ వెల్ 2, సోధి 2 వికెట్లు పడగొట్టారు. ఆపై బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 47 ఓవర్లు బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. ఓపెనర్లు టామ్ లాథమ్ 78, డెవన్ కాన్వే 82 పరుగులతో అజేయంగా ఉన్నారు.