33 మంది తాలిబాన్లను చంపి పోలీస్ స్టేషన్​ ను తిరిగి దక్కించుకున్న పాక్​

By udayam on December 21st / 4:48 am IST

పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వాలో తాలిబాన్ల చెర నుంచి పోలీసులను విడిపించినట్లు ఆ దేశ హోంశాఖ వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో 33మంది తాలిబాన్ ఫైటర్లు, ఇద్దరు సైనికులు చనిపోయినట్లు వెల్లడించారు. మరొక 15మందికి గాయాలు అయ్యాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆపరేషన్ ప్రారంభించగా 2.30 గంటల కల్లా ముగిసినట్లు మంత్రి వెల్లడించారు. బన్ను కంటోన్మెంట్‌లోని ఒక కౌంటర్ టెర్రరిజం కేంద్రాన్ని తాలిబాన్లు తమ అధీనంలోకి తీసుకుని అక్కడి సిబ్బందిని బంధీలుగా పట్టుకుంది.

ట్యాగ్స్​