దివాళా అంచున పాకిస్థాన్​.. 5.8 బిలియన్లకు తగ్గిన ఫారెక్స్​ నిల్వలు

By udayam on December 30th / 9:05 am IST

పొరుగుదేశం పాకిస్థాన్​ తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతంది. ఆ దేశ విదేశీ మారక నిల్వలు గురువారం నాడు 294 మిలియన్​ డాలర్లు కరిగిపోయి.. 5.8 బిలియన్లకు చేరుకుంది. దీంతో త్వరలోనే ఈ దేశం దివాళా తీయనుందని ప్రపంచ ఆర్ధిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది జూన్​ లో 9.816 బిలియన్ల ఆర్ధిక నిల్వలు స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ పాకిస్థాన్​ లో ఉండగా.. గడిచిన 6 నెలల్లో ఆ మొత్తం సగానికి తగ్గిపోయింది. దీంతో ఈ దేశం చేసిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించడం అటుంచితే కనీసం దిగుమతులకు సైతం చెల్లింపులు చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తనుంది.

ట్యాగ్స్​