పాకిస్థాన్ సైన్యానికి కొత్త చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ను నియమిస్తూ ఆ దేశ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి, ప్రతిభ ఆధారంగా మునీర్ ను ఎంపిక చేసినట్లు రక్షణ మంత్రి క్వాజా ఆసిఫ్ గురువారం మీడియాకు వెల్లడించారు. సైన్యంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేయగల ఈ పోస్టుకు ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై కొంతకాలంగా పాక్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, దేశ చీఫ్ స్పైగా సేవలందిస్తున్న అసీమ్ మునీర్ ను ప్రభుత్వం ఆర్మీ చీఫ్ పోస్టుకు ఎంపిక చేసింది.