30 మంది టెర్రరిస్టుల్ని వదిలేసిన పాకిస్థాన్​

By udayam on May 19th / 5:35 am IST

ఆఫ్ఘనిస్థాన్​కు చెందిన టిటిపి ఉగ్రసంస్థతో పాకిస్థాన్​ జరుపుతున్న కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా 30 మంది కరడుగట్టిన ఉగ్రవాదుల్ని తమ జైళ్ళ నుంచి విడుదల చేసింది. ఈ విషయాన్ని జియో న్యూస్​ రిపోర్ట్​ చేసింది. విడుదలైన టెర్రరిస్టుల్లో చాలా మంది ఖైబర్​ పఖ్తుంక్వా, అక్కడి ట్రైబల్​, దక్షిణ వజీరిస్తాన్​ ప్రాంతాలకు చెందిన వారేనని తెలిపింది. అదే సమయంలో విడుదలైన వారిలో హై ప్రొఫైల్​ టెర్రరిస్టులు లేరని పాకిస్థాన్​ తన దేశ ప్రజలకు సర్ధి చెప్పుకుంది.

ట్యాగ్స్​