ఈవీఎంలకు పాకిస్థాన్​ గుడ్​బై

By udayam on May 27th / 7:08 am IST

పాకిస్థాన్​ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలో జరిగే ఎలాంటి ఎన్నికల్లోనూ ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మెషీన్లను వినియోగించకూడదని ఆ దేశ పార్లమెంట్​ చట్టం చేసింది. అదే సమయంలో విదేశాల్లో ఉండే పాకిస్థానీయులు ఐ–ఓటింగ్​ ద్వారా పాల్గొనడాన్ని సైతం రద్దు చేసింది. ఈ మేరకు ఇటీవల ఎన్నికైన నూతన ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ముర్తాజా జావేద్​ అబ్బాసీ సభలో ప్రవేశపెట్టగా.. దానికి సభ ఆమోద ముద్ర వేసింది.

ట్యాగ్స్​