ఆ దేశంలో 99 శాతం వ్యాక్సినేషన్​

By udayam on October 14th / 1:12 pm IST

పసిఫిక్​ తీర దేశం పలావ్​ లో 99 శాతం వ్యాక్సినేషన్​ పూర్తయింది. దీంతో ప్రపంచం మొత్తం మీద అత్యధిక వ్యాక్సినేషన్​ జరిగిన దేశంగా పలావ్​ నిలిచింది. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ రెడ్​ క్రాస్​ ప్రకటించింది. కేవలం 18 వేల మంది జనాభా ఉండే ఈ దేశంలో ఇప్పటి వరకూ 16,152 మందికి పూర్తి వ్యాక్సినేషన్​ జరిగింది. ఈ దేశంతో పాటు ఫిజి, కుక్​ ఐలాండ్స్​లోనూ వ్యాక్సినేషన్​ ప్రక్రియ చివరికి వచ్చేసిందని రెడ్​ క్రాస్​ సంస్థ ప్రకటించింది.

ట్యాగ్స్​