హాలీవుడ్ శృంగార తార పమేలా ఆండర్సన్ తాను అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.
Goodbye Social Media #hallelulia https://t.co/q2H693Rq3T
— Pamela Anderson (@pamfoundation) January 26, 2021
నాకు సోషల్ మీడియా అంటే ఇష్టం చచ్చిపోయింది. ఇకపై బుక్స్ చదువుతూ ప్రకృతితో కలిసి జీవించాలని అనుకుంటున్నా అంటూ తన ఇన్‌స్టా అకౌంట్లో రాసుకొచ్చింది.
53 ఏళ్ళ పమేలా ఆండర్స్న్కు ఇన్‌స్టా గ్రామ్‌లో 12 లక్షలు, ఫేస్బుక్లో 9 లక్షలు, ట్విట్టర్లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇలా సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోవడానికి వేరే కారణం కూడా ఉందంటున్నారు ఆమె అభిమానులు. ఆమె తన బాడీగార్డ్ డాన్ హేహర్స్ట్ తో డేటింగ్లో ఉందని.. జీవితంలో 5వ సారి తిరిగి పెళ్ళిబాటలో నడవాలనుకుంటోందని హాలీవుడ్ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.