ఈరోజుల్లో సినిమా అంటే ఏ ధియేటర్‌కి వెళ్దాం అని కాకుండా.. ఏ ఓటిటిలో ఉంది అనే ప్రశ్నే వినిపిస్తోంది. అంతలా ప్రపంచవ్యాప్తంగా ఓటిటిలు మన మొబైళ్ళలోకి దూసుకొచ్చేశాయి. ఇప్పటికే ఉన్న ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5, సన్ నెక్ట్స్, ఆహా స్ట్రీమింగ్ లకు గట్టి పోటీనివ్వడానికి పారామౌంట్ సిద్ధమైంది. సూపర్‌హిట్ కంటెంట్‌ను ఇస్తుందని మంచి పేరున్న పారామౌంట్+ ఓటిటి దేశంలోని అన్ని భాషల్లో తన సేవలు అందించడానికి సిద్ధమవుతోంది.