పార్లమెంట్ శీతాకల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన ఎస్పీ నేత ములాయం సింగ్, టాలీవుడ్ హీరోలు కృష్ణ, కృష్ణంరాజు సహా తదితరులకు లోక్సభ, రాజ్యసభలు నివాళులర్పించాయి. సంతాప తీర్మానం తర్వాత సభను మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. కాగా, ఈ సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఉపరాష్ట్ర జగదీప్ ధన్ఖడ్కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.