ఇండిగో : ఎయిర్​ హోస్టెస్​ తో ప్రయాణికుడి తీవ్ర వాగ్వాదం

By udayam on December 21st / 12:24 pm IST

ఇస్తాంబుల్​–ఢిల్లీ మధ్య తిరుగుతున్న ఓ ఇండిగో విమానంలో ప్రయాణికుడికి, ఎయిర్​ హోస్టెస్​ కు మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్​ గా మారింది. దీనిని రికార్డ్​ చేసిన పోస్ట్​ చేసిన వ్యక్తి.. భోజనం విషయమై వీరిద్దరి మధ్యా గొడవ ప్రారంభమైందని తెలిపాడు. ఆపై ఎయిర్​ హోస్టెస్​ తో ప్రయాణికుడు తీవ్రంగా గొడవ పడడం.. ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోవడం వీడియోలో రికార్డ్​ అయింది. ఈ ఘటనపై విమాన సిబ్బంది ప్రయాణికుడిపై కంప్లైంట్​ చేసింది.

ట్యాగ్స్​