విమానంలో షర్ట్​ విప్పి రచ్చ చేసిన యువకుడు

By udayam on September 20th / 6:52 am IST

దుబాయ్​ వెళ్ళేందుకు పాకిస్థాన్​లోని పెషావర్​లో విమానం ఎక్కిన ఓ యువకుడు విమానం గాల్లోకి ఎగిరిన అనంతరం రచ్చ రచ్చ చేశాడు. ఈనెల 14న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. ముందు ప్రయాణికులు నడిచే దారిలో పడుకున్న అతడు ఆపై చొక్కా విప్పేసి కేవలం బనియన్​తో సీట్లపైకి ఎక్కాడు. ఆపై విమానం అద్దాలను కాలితో బలంగా తన్నుతూ నానా రభస చేశాడు. దీంతో విమాన సిబ్బంది అతడిని ఓ సీటుకు కట్టేశారు. దుబాయ్​లో ల్యాండ్​ అయిన వెంటనే అతడిని పోలీసులకు అప్పగించి.. పాకిస్థాన్​ ఎయిర్​లైన్స్​లో మరోసారి ప్రయాణించకుండా బ్లాక్​లిస్ట్​లో పెట్టారు.

ట్యాగ్స్​