పఠాన్.. గత 4 ఏళ్ళుగా షారూక్ ఖాన్ పనిచేసిన ఈ ప్రాజెక్ట్ తొలి ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. హాలీవుడ్ యాక్షన్ ఫ్రాంఛైజులైన జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లకు ధీటుగా ఈ మూవీని తెరకెక్కించినట్లు ట్రైలర్ తోనే డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ ప్రూవ్ చేసుకున్నాడు. ఒళ్ళు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలలో షారూక్, దీపికా పదుకొణె, జాన్ అబ్రహంల నటన ఆకట్టుకుంటోంది. సినిమా తగ్గట్టే ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో తెరకెక్కించారు.