సెట్స్ మీదికి ‘క్రిష్ – పవన్’ మూవీ

By udayam on January 12th / 6:04 am IST

ఓపక్క జనసేన పార్టీ సారధిగా రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమాలతో కూడా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ బిజీగా మారిపోయారు.

సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తూనే వరుస సినిమాలకు కమిట్ అయిపోవడంతో రెస్ట్ లేకుండా చకచకా కానిచ్చేస్తున్నారు. ఎందుకంటే కరోనా కారణంగా అన్నీ జాప్యం అయ్యాయి. ఇక ఇటీవలే ‘వకీల్‌సాబ్‌’ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుంది.

ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా కూడా ప్రకటించింది. ‘వకీల్‌సాబ్‌’ తర్వాత పవన్‌ కల్యాణ్‌ 27వ చిత్రంగా, క్రిష్‌ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.

అదే సమయంలో క్రిష్‌కు కరోనా పాజిటివ్ రావడంతో చిత్రయూనిట్‌ షూటింగ్‌ను వాయిదా వేసింది. ప్రస్తుతం క్రిష్ కరోనా నుంచి కోలుకోవడంతో.. చిత్రషూటింగ్‌ మొదలైనట్లు చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లినట్లు తెలుపుతూ.. షూటింగ్‌ లొకేషన్‌ ఫొటోలతో సహా చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్‌ బ్యానర్ అఫీషియల్‌ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

ఈ పిక్స్‌లో డైరెక్టర్‌ క్రిష్‌, అతని టీమ్‌ కనిపిస్తోంది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ వైరల్‌ చేసేశారు. అలాగే సాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో చేయనున్న చిత్రంలో కూడా పవన్‌ కల్యాణ్‌ నటించనున్నారని, ఏకకాలంలో ఈ రెండు చిత్రాల షూటింగ్‌ ఉంటుందని టాక్.