మైత్రీ–పవన్​–హరీష్​ మూవీ పట్టాలెక్కోస్తోందా!

By udayam on November 21st / 1:02 pm IST

ఎప్పటి నుంచో పవన్​ కళ్యాణ్​ ను తిరిగి మరోసారి డైరెక్ట్​ చేద్దామనుకుంటున్న హరీష్​ శంకర్​ ప్రయత్నాలు ఎట్టకేలకు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. వీరిద్దరి కాంబోలో ‘భగవీయుడు భగత్​ సింగ్​’ మూవీ ని ప్రకటించి ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయినా.. కనీసం పూజా కార్యక్రమాలు కూడా మొదలుకాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించడానికి అటు పవన్​, ఇటు హరీష్​ లతో నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అంతా బాగుంటే వచ్చే నెలలోనే ఈ మూవీ షూటింగ్​ కు కొబ్బరికాయ కొట్టేయనున్నారు.

ట్యాగ్స్​