జనవరి నుంచి ‘వినోదయ సీతం’!

By udayam on December 19th / 7:54 am IST

పవన్​ కళ్యాణ్​ ఇటు రాజకీయాల్లో ఎంత వేగంగా అడుగులేస్తున్నాడో.. అటు సినిమా షూటింగ్స్​ లోనూ అంతే వేగాన్ని చూపిస్తున్నాడు. ఇప్పటికే వీరమల్లు షూటింగ్​ తో పాటు.. ఉస్తాద్​ భగత్​ సింగ్​ షూటింగ్స్​ తో బిజీగా అతడు.. వచ్చే జనవరి నుంచి వినోదయ సీతం రీమేక్​ లోనూ నటించనున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి ఫస్ట్ టైం ఈ తమిళ రీమేక్ లో నటించబోతున్నట్టు ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. జనవరి 16 లేదా 18 తేదీల నుంచి ఈ మూవీ మొదలవ్వనుందని టాక్​.

ట్యాగ్స్​