పవన్​ చేతుల మీదుగా అర్జున్​–విశ్వక్​ల మూవీ

By udayam on June 23rd / 8:58 am IST

దక్షిణాది యాక్షన్​ హీరో అర్జున్​ సర్జా స్వీయ దర్శకత్వంలో.. టాలీవుడ్​ యువ కథానాయకుడు విశ్వక్​ సేన్​ నటిస్తున్న మూవీ షూటింగ్​ ఈరోజు ప్రారంభమైంది. పవర్​ స్టార్​ పవన్​ కళ్యాణ్​ ఈ చిత్రానికి క్లాప్​ కొట్టారు. రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పవన్​ కళ్యాణ్​ హాజరయ్యారు. ఈ మూవీలో అర్జున్​ కూతురు ఐశ్వర్య హీరోయిన్​గా చేస్తోంది. దర్శకత్వం వహించడంతో పాటు అర్జున్​ ఈ చిత్రానికి కథ, మాటలు కూడా అందిస్తూ సొంతంగా నిర్మిస్తున్నాడు. జగపతి బాబు ఈ మూవీలో కీలక రోల్ పోషిస్తున్నాడు.

ట్యాగ్స్​