వెయిటింగ్​ కు తెర: అన్​ స్టాపబుల్​ సెట్లో పవన్​ కళ్యాణ్​

By udayam on December 27th / 9:59 am IST

బుల్లితెర పై సెన్సేషనల్​ కాంబినేషన్లను సెట్​ చేస్తున్న బాలయ్య అన్​ స్టాపబుల్​ లో మరో క్రేజీ ఎపిసోడ్​ కు రంగం సిద్ధమైంది. ఈ షో కోసం పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్​ ఆహా స్టూడియోస్​ కు వచ్చిన వీడియోలు నెట్టింట వైరల్​ గా మారాయి. ఈ షో కు పవన్​ కళ్యాణ్​ హాజరవుతాడని ఈ సీజన్​ రెండో ఎపిసోడ్​ లోనే బాలయ్య మనకు హింట్​ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని నిజం చేస్తూ పవన్​ కళ్యాణ్​ ఈరోజు ఆహా స్టూడియోస్​ కు హాజరయ్యారు. ఈ షో లో త్రివిక్రమ్​ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన టీజర్​ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్​