వీరసింహారెడ్డి సెట్స్​ లో వీరమల్లు

By udayam on December 24th / 4:38 am IST

గోపీచంద్ మలినేని డైరెక్షన్లో నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ వీరసింహారెడ్డి సెట్స్​ కు.. పవన్​ కళ్యాణ్​ తన హరిహర వీరమల్లు టీంతో సహా వచ్చారు. అన్నపూర్ణ స్టూడియోస్​ లో బాలయ్య పై సాంగ్​ చిత్రీకరణ జరుగుతుండగా పవన్​ సెట్ లోకి వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా ఆన్​ లైన్లో వైరల్​ గా మారాయి. వీరిద్దరి మధ్య సినిమా చర్చలే నడిచాయని తెలుస్తోంది. త్వరలోనే బాలకృష్ణ హోస్ట్​ గా చేస్తున్న అన్​ స్టాపబుల్​ లో త్రివిక్రమ్​ తో కలిసి పవన్​ సందడి చేయనున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​