పవన్​ షో.. పండగకు కూడా లేదా!

By udayam on January 3rd / 11:42 am IST

నందమూరి బాలయ్య డిజిటల్​ టాక్​ షో ‘అన్​ స్టాపబుల్​’ లో ప్రసారం అయ్యే వరుస ఎపిసోడ్ల లిస్ట్​ ను ఆహా టీం విడుదల చేసింది. ఇప్పటికే పూర్తయిన పవన్​ కళ్యాణ్​ ఇంటర్వ్యూ ఎపిసోడ్​ ను పండుగకు రిలీజ్​ చేయట్లేదని ఆహా ప్రకటించింది. జనవరి 6న ప్రభాస్​ తో షో రెండో ఎపిసోడ్​ ను స్ట్రీమింగ్​ చేస్తామన్న ఆ కంపెనీ.. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా వీర సింహారెడ్డి టీమ్​ తో షో ను స్ట్రీమింగ్​ చేయనున్నారు. ఆ తర్వాతే పవన్​ కళ్యాణ్​ షో స్ట్రీమింగ్​ చేయనున్నట్లు వెల్లడించింది. అంటే ఈ షో జనవరి 26న వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ట్యాగ్స్​