ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, మరోవైపు ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఇది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తీస్తున్నారు క్రిష్. ఈ క్రమంలో సెట్ నుండి లీక్ అయిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బ్రౌన్ కలర్ కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తున్నారు పవన్. మొఘల్స్ కాలం నాటి కథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో బందిపోటు దొంగగా ఆయన నటిస్తున్నారు.