బాలయ్య, పవన్​ ఎపిసోడ్​ లో ప్రశ్నలు లీక్​!

By udayam on December 28th / 9:28 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారి డిజిటల్ టాక్ షో “అన్స్టాపబుల్ విత్ ఎన్​.బి.కె. సీజన్​ 2 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూర్తయిన ఈ ఎపిసోడ్​ షూటింగ్లో బాలయ్య.. పవన్​ ను అడిగిన ప్రశ్నలు లీక్​ అయ్యాయి. అకిరా నందన్ ని పెట్టి తమ్ముడు సినిమా సీక్వెల్ తీయొచ్చుగా, అకిరాని త్వరగా లాంచ్ చెయ్యొచ్చుగా అని పవన్​ ను బాలయ్య అడిగారట! అలానే ఈ ఎపిసోడ్ లో సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ గా హీరో సాయిధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడని తెలుస్తోంది. పవన్​ ఎంట్రో స్పీచ్​ లో బాలయ్య.. బండ్ల గణేష్ వాడే ఫేమస్ డైలాగ్ ఈశ్వరా.. పవనేశ్వరా.. అంటూ పిలుస్తారని తెలుస్తోంది.

ట్యాగ్స్​