వారాహికి 2న కొండగట్టులో ప్రత్యేక పూజలు

By udayam on December 29th / 1:05 pm IST

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచార బస్సు సిద్ధమైంది. ఈ ప్రచార బస్సుకు వారాహి అనే పేరు పెట్టడం జరిగింది. రీసెంట్ గా వారాహి తో పాటు మరికొన్ని వాహనాలకు రిజిస్టేషన్ పనులను పూర్తి చేయడం జరిగింది. ఇక జనవరి 2 న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు లో వారాహి కి ప్రత్యేక పూజలు చేయబోతున్నారు.ఏకాదశిని పురస్కరించుకొని.. జనసేన నేతలు వాహన పూజకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్​