వాహణాల రిజిస్ట్రేషన్​ కోసం ఆర్టీఓ కార్యాలయానికి పవన్​

By udayam on December 23rd / 12:49 pm IST

జనసేన అధినేత పవన్​ కళ్యాణ్​ అంతర్జాతీయ డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం స్వయంగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకోసం గురువారం హైదరాబాద్​ లోని రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తన దరఖాస్తును అధికారులకు సమర్పించారు. దీంతో పాటు తన వాహనాల రిజిస్ట్రేషన్ల పనులనూ ఆయన పూర్తి చేశారు. అరగంటలోనే ఆయన వాహనాల రిజిస్ట్రేషన్​ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. శాశ్వత నెంబర్లు కేటాయించిన వాటిలో ఆయన పర్సనల్​ వాహనం మెర్సిడస్​ బెంజ్​, రెండు మహీంద్ర స్కార్పియోలు, ఒక జీపు, ఒక టయోటా వెల్​ ఫేర్​ కారుతో పాటు సరకు రవాణా వాహనం కూడా ఉంది. అయితే ఇందులో ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ ఉందా? లేదా? అన్నది తేలలేదు.

ట్యాగ్స్​