వీరయ్య సెట్లో వీరమల్లు

By udayam on November 23rd / 5:18 am IST

మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న మూవీ వాల్తేరు వీరయ్య. బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ ను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు సినిమాలోని పార్టీ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ ను పవన్ కళ్యాణ్ వీక్షించారు. తన అన్నయ్య చిరంజీవితో కలిసి ‘వాల్తేరు వీరయ్య’ ఫస్ట్ సింగిల్ ను ఆస్వాదించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫొటోల్లో పవన్ కల్యాణ్, చిరంజీవిలతో పాటు ‘వాల్తేరు వీరయ్య’ దర్శకుడు బాబీ కూడా ఉన్నారు.

ట్యాగ్స్​