జనసేనాని యాత్ర కి ‘వారాహి’ సిద్ధం

By udayam on December 7th / 12:14 pm IST

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి తెరవెనక ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా బస్సు యాత్ర కోసం సిద్దం చేసిన వాహనానికి సంబంధించిన ఫొటోలను పవన్‌ కళ్యాణ్‌ ట్విట్టర్‌లో బుధవారం పోస్టు చేశారు. అలాగే ఓ వీడియోను కూడా షేర్‌ చేశారు. వారాహి ఎన్నికల సమరానికి సిద్ధమైందని పేర్కొన్నారు. ఆ వాహనానికి వారాహి అని పేరు పెట్టినట్టుగా తెలుస్తోంది.

ట్యాగ్స్​