పవన్​ ఫోన్​ తో దీక్ష విరమించిన జోగయ్య

By udayam on January 3rd / 7:01 am IST

కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమించిన హరిరామజోగయ్య ఎట్టకేలకు దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన నివాసంలో నిరాహార దీక్షకు దిగడం, ఆపై ఆయనను పోలీసులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం తెలిసిందే. అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించేందుకు ప్రయత్నించడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. జోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. సమగ్రంగా చర్చించి ముందుకు వెళదామని హరిరామజోగయ్యకు పవన్ నచ్చచెప్పారు. దీంతో జోగయ్య దీక్షను విరమించారు.

ట్యాగ్స్​