ఫుట్​ బాల్​ దిగ్గజం పీలే ఇక లేడు

By udayam on December 30th / 4:39 am IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం బ్రెజిల్‌ ఆటగాడు పీలే (82) గురువారం అర్థరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన సావోపోలో లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. బ్రెజిల్‌కు చెందిన పీలే గత ఏడాది క్యాన్సర్‌ బారినపడ్డారు. అప్పటి నుంచి చికిత్స తీసుకుంటుండగా.. ఇటీవల ఆరోగ్యం విషమించి వివిధ అవయవాలు పని చేయడం మానేశాయి. ఫుట్​ బాల్​ చరిత్రలో దిగ్గజ ఆటగాళ్ళలో నెంబర్​ 1 స్థానంలో ఉండే అతడు మరణించడంతో ఫుట్​ బాల్​ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బ్రెజిల్‌కు మూడు సార్లు ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు అందించిన ఈ దిగ్గజ ఆటగాడు కెరీర్లో మొత్తం 1281 గోల్స్​ చేశాడు.

ట్యాగ్స్​