బలవంతంగా ఇనుప బాక్సుల్లో క్వారంటైన్!

By udayam on January 14th / 5:50 am IST

చైనాలో అమలవుతున్న జీరో కొవిడ్​ పాలసీకి అక్కడి జనం బిక్కచచ్చిపోతున్నారు. ఒక్క కేసు వచ్చిందంటే కోట్ల జనాభాకు లాక్​డౌన్​ పెట్టేస్తున్న ఆ దేశం అక్కడి జనాలను సైతం నిర్భంధ క్వారంటైన్​ సెంటర్లకు తరలిస్తోంది. దీంతో అక్కడి జనం పడుతున్న అవస్థలకు సంబంధించి కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. జనాల్ని ఇనుప కంటైనర్ బాక్సుల్లో క్వారంటైన్​ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. రోడ్లపై వందలాది బస్సుల్లో ప్రజలు ఊర్లు ఖాళీ చేసేస్తున్నారు.

ట్యాగ్స్​