ఆంధ్రప్రదేశ్ ప్రజలు భానుడి తాపంతో అల్లల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లో ఆ రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలను దాటేశాయి. విజయవాడ, విశాఖ, కాకినాడ, కడప, రాజమండ్రిలలో వీధి వ్యాపారులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పశ్చిమగోదావరిలోని కామవరపుకోటలో 45.2 డిగ్రీలు, రాజానగరంలో 44.7, కాకినాడలో 44.2, ఇబ్రహీంపట్నంలో 44.2, మైలవరంలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.