ఈ ఏడాది మార్చిలో భారీ నగదుతో పట్టుబడ్డ కాన్పూర్ పెర్ఫ్యూమ్ వ్యాపారి పీయుష్ జైన్ గుర్తున్నాడా? ఎలా మర్చిపోతాం అన్ని డబ్బు కట్టలతో దొరికినోడిని అంటారా!! అతడు మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు. దాదాపు రూ.195 కోట్ల నగదు. 23 కేజీల బంగారం, 600 కేజీల గంధపు ఆయిల్‌తో దొరికిన అతడు తాజాగా 54 కోట్లను ప్రభుత్వ ఖజానాకు పన్నురూపంలో చెల్లించాడు. అతడిపై కేసు ఇంకా విచారణలో ఉండగా టాక్స్ ఎగ్గొట్టిన కేసు నుంచి మినహాయింపునకు ఈ పని చేసినట్లు అతడి లాయర్ కోర్టుకు వెల్లడించాడు.