3:50 pm
Thursday, October 29, 2020

28°C
Vishakhapatnam, India

ఊపందుకున్న పెట్రో విక్రయాలు 2 weeks ago

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ తర్వాత దేశంలో అమాంతం తగ్గిన పెట్రోలు విక్రయాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ నెలలో గణనీయంగా పెరిగి కరోనా ముందునాటి స్థితికి చేరుకున్నాయి. దేశంలోని మూడు ప్రభుత్వ రంగ రిటైలర్ల డీజిల్ విక్రయాలు అక్టోబరులో 8.8 శాతం పెరిగినట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డేటా వెక్కడిస్తోంది.

దేశంలోని మొత్తం ఇంధన డిమాండ్‌ (2.65 మిలియన్ టన్నులు)లో 40 శాతం వాటా కలిగిన డీజిల్ విక్రయం గత నెలతో పోలిస్తే 24 శాతం పెరిగింది. గతేడాది అక్టోబరు తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈసారి అదే సమయానికి పెట్రోలు విక్రయాలు 1.5 శాతం పెరిగి 9,82,000 టన్నులకు చేరుకున్నాయి. గత నెలలో ఇదే సమయంతో పోలిస్తే ఇది 1.45 శాతం ఎక్కువ.

అలాగే, గతేడాది అక్టోబరు తొలి అర్ధభాగంతో పోలిస్తే ఈసారి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు వంట గ్యాస్‌ 7 శాతం అధికంగా విక్రయించాయి. అంటే దాదాపు 1.17 మిలియన్ తెన్నులని చెప్పాలి. ఇక  జెట్ ఇంధన అమ్మకాలు 57 శాతం తగ్గి 1,35,000 టన్నులకు దిగజారాయి.