శ్రీలంకలో లీటర్​ పెట్రోల్​ రూ.420

By udayam on May 24th / 12:01 pm IST

ఆర్ధిక కష్టాల్లో ఉన్న శ్రీలంక అక్కడి ప్రజలకు కనీస అవసరాలు సైతం దక్కకుండా చేస్తోంది. ఈరోజు పెట్రోల్​, డీజిల్​ ధరలను భారీగా పెంచేసింది. పెట్రోల్​పై 24.3 శాతం ధరను పెంచిన ఆ దేశం డీజిల్​పై38.4 శాతం పెంచింది. దీంతో ఒక లీటరు పెట్రోల్​ ఆ దేశంలో రూ.420కు, డీజిల్​ రూ.400లకు చేరింది. అదే సమయంలో శ్రీలంకలో ద్రవ్యోల్బణం 40 శాతానికి చేరుకుంది. పెట్రోల్​, డీజిల్​ ధరలు మండిపోతున్నందున ప్రజలు బయటకు రావొద్దని, వర్క్​ ఫ్రమ్​ హోం కిందే పనిచేయాలని సూచించింది.

ట్యాగ్స్​