ఎపిలో భారీగా తగ్గిన పెట్రోల్​, డీజిల్​ ధరలు

By udayam on May 23rd / 5:18 am IST

కేంద్ర ప్రభుత్వం నిన్న చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గించిన వెంటనే ఎపి ప్రభుత్వం సైతం ఆ వెసులుబాటును ప్రజలకు కల్పించింది. దీంతో ఎపిలో లీటరు పెట్రోల్​పై రూ.9.50, డీజిల్​పై రూ.7.30 చొప్పున ధర తగ్గింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్​, డీజిల్​ ధరలు రెండు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం విజయవాడలో లీటరు పెట్రోల్​ రూ.111.33 గా ఉండగా డీజిల్​ రూ.99.12గా ఉంది. శనివారం వీటి ధరలు వరుసగారూ.120.86, రూ.106.50గానూ ఉండేవి.

ట్యాగ్స్​