అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ తన కొవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను గర్భిణులపై చేపడుతోంది. ఇందుకు గానూ అమెరికాలో దాదాపు 4 వేల మంది గర్భిణులను ఎంపిక చేయనుంది.
అమెరికా అవతల అర్జెంటీనా, బ్రెజిల్, కెనడ, చిలీ, మొజాంబిక్, సౌత్ ఆఫ్రికా, స్పెయిన్, యుకె లలో సైతం 18 ఏళ్ళ పైబడిన 24 నుంచి 34 నెలల గర్భిణులపై ఈ పరీక్షలు చేయాలని నిర్ణయించింది.
ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకుని వివిధ దేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ వ్యాక్సిన్‌ను ఇప్పుడు మొదటి సారిగా గర్భిణులపై పరీక్షించనున్నారు.
ఈ పరీక్షలు విజయవంతం అయిన తర్వాత వ్యాక్సిన్‌ను చిన్నారులపై సైతం పరీక్షించాలని భావిస్తున్నారు.