ఫైజర్​ డోస్​ రూ.730!

By udayam on June 10th / 11:12 am IST

భారత్​లో లాంచ్​కు సిద్ధమవుతున్న అమెరికా సంస్థ ఫైజర్​ తన కరోనా వ్యాక్సిన్​ ధరను రూ.730 లోపునే ఉంచనున్నట్లు బిజినెస్​ స్టాండర్డ్​ వెబ్​సైట్​ రాసింది. ఈ వ్యాక్సిన్​ కోసం ఇప్పటికే భారత ప్రభుత్వం ఈ సంస్థను సంప్రదించగా ఇక్కడ దీనిని వాడిన వారికి వచ్చే సైడ్​ ఎఫెక్ట్స్​ నుంచి కంపెనీకి ప్రొటెక్షన్​ కావాలని ఆ సంస్థ కేంద్రానికి సూచించింది. ప్రస్తుతం ఈ స్థాయిలో చర్చలు జరుపుతుండగా ఈ వ్యాక్సిన్​ ధర విషయం బయటకొచ్చింది. అమెరికలో ఈ వ్యాక్సిన్ ధర రూ.1423 గా ఉండగా యుకెలో రూ.1532గా ఉంది.