విమానాన్ని నడుపుతూ నిద్రలోకి జారుకున్న ఓ పైలట్ విధి నిర్వహణలో అలసత్వానికి గానూ సస్పెండ్ అయ్యాడు. ఇటలీకి చెందిన ఓ ప్రధాన ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా ఉన్న అతడు దాదాపు 10 నిమిషాల పాటు కమ్యూనికేషన్ వ్యవస్థకు స్పందించకపోవడంతో ఫ్రెంచ్ అధికారులు ఈ విమానం హైజాక్ చేయబడిందేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. దాంతో పాటు విమానానికి ఎస్కార్ట్‌గా వెళ్ళడానికి 2 యుద్ధ విమానాలనూ గాల్లోకి పంపించారు. అయితే వెంటనే పైలట్ అందుబాటులోకి రావడంతో అసలు విషయం తెలుసుకుని కుదుటపడ్డారు.