కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చిరు 152వ చిత్రం గా ‘ఆచార్య’ ప్రస్తుతం హైదరాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేటలో వేసిన భారీ టెంపుల్ టౌన్ సెట్లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.
నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి లేటెస్ట్గా రిలీజ్ డేట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
చిత్ర యూనిట్ మాటలను బట్టి మే 9న ‘ఆచార్య’ను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. అదే రోజున గతంలో జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు విడుదలయ్యాయి.
ఈ సినిమాలు ఎంత భారీ విజయాన్ని సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. దేవాదాయశాఖ లోని అవినీతిని ప్రశ్నించేలా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. మరి మరోసారి అదే రోజున చిరంజీవి ఆచార్యతో థియేటర్లలోకి వస్తాడా లేదా అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది.