దేశంలో 5జి రాకతో భారత ఆర్ధిక వ్యవస్థకు 450 బిలియన్ డాలర్ల మేర లాభం చేకూరనుందని ట్రాయ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న మోదీ వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం చివరి నాటికి దేశంలో 6జి సేవలనూ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. 5జి టెస్ట్ బెడ్ తో భారత ఎకో సిస్టమ్ స్టార్టప్ లకు మరింత మేలు చేకూర్చనుందన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల దేశంలో మొబైల్ తయారీ సంస్థలు 2 నుంచి 200లకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.